![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -986 లో.. శైలెంద్రనే రిషిని కిడ్నాప్ చేసాడని భావించిన వసుధార తన దగ్గరకి వెళ్లి కాలర్ పట్టుకొని నీలదీస్తుంది. రిషి సర్ ఎక్కడ అంటు చెయ్ చేసుకుంటుంది. అప్పుడే దేవయాని ఫణింద్ర ఇద్దరు అక్కడికి వస్తారు. ఏం చేస్తున్నావ్ నా కొడుకుని ఎందుకు కొడుతున్నావని దేవయాని అడుగుతుంది. రిషి సర్ ని కిడ్నాప్ చేసింది వీడే సర్ అని ఫణింద్రతో వసుధార చెప్తుంది. ఇన్ని రోజులు మీరు బాధపడుతారని నిజం దాచాం సర్ అని వసుధార అనగానే.. నేనేం బాధపడను ఇప్పుడు నాకు నిజం తెలియాలని ఫణీంద్ర అంటాడు.
ఇన్ని రోజులు ఎండీ సీట్ కోసం వీడు చెయ్యని కుట్రలు లెవు.. రిషి సర్ పై, నాపై ఎప్పుడు ఎటాక్ లు జరుపుతూనే ఉన్నాడు. జగతి మేడమ్ ని బెదిరించి ఆ రోజు మాతో అలా అబద్ధం చెప్పించాడు. జగతి మేడమ్ ని చంపించింది కూడా వీడే అని వసుధార చెప్తుంటే ఫణీంద్ర షాక్ అవుతాడు. రిషి సర్ ని కిడ్నాప్ చేసాడని వసుధార చెప్తుంటే అప్పుడు వీడు హాస్పిటల్ లో ఉన్నాడు కాదా అని ఫణింద్ర అంటాడు. వీడు హాస్పిటల్ లో ఉంటే వీనికి ఎంత మంది రౌడీలు తెలుసో మీకు తెలుసా సర్ చాలసార్లు రౌడీలకి డబ్బులు ఇస్తూ ఉంటే ధరణి మేడమ్ చూసారని వసుధార చెప్తుంది. ధరణి నువ్వు చూసావా అని ఫణీంద్ర అడుగుతాడు. అవును చూసానని ధరణి చెప్పగానే.. నేను ఎవరికి ఇచ్చానో చూసావా? డెలివరి బాయ్ కి ఇచ్చానో తెలుసా అని శైలేంద్ర కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. రిషి సర్ ని కాపాడుకొని నా ఇంటికి తెచ్చుకొని బాగా చూసుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు కిడ్నాప్ చేసాడని వసుధార అనగానే.. అంటే రిషి ఇన్ని రోజులు నీ దగ్గరే ఉన్నాడా అని మళ్ళీ వసుధార పైకి శైలేంద్ర డైవర్ట్ చేస్తాడు. రిషి సర్ ని శైలేంద్రే కిడ్నాప్ చేసాడని నా దగ్గర సాక్ష్యం ఉందని వీడియో చూపించబోతే అందులో వీడియో ఉండదు. అప్పుడే ముకుల్ వచ్చి శైలేంద్ర తప్పు చేసాడని నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యం లేదని ముకుల్ చెప్తాడు. ఏంటి వసుధార తప్పు చేసాడని అంటున్నావ్ వీడియో లేదని అంటున్నావ్ తప్పు చేసాడని తెలిస్తే.. నా కొడుకు అయిన సరే నేను వదిలిపెట్టను. సాక్ష్యం లేదు కాబట్టి తల దించుకొని వెళ్తున్నా.. లేదంటే నిన్ను జైలుకి పంపించేదాన్ని అని వసుధార అంటుంది.
ఆ తర్వాత వసుధార, మహేంద్ర, అనుపమ, ముకుల్ ఇంటికి వెళ్లి.. ఆ వీడియో ఎవరు డిలీట్ చేశారో ఆలోచిస్తారు. అసలు ఇప్పుడు రిషి కన్పించకపోవడానికి కారణం శైలేంద్ర కాదని తెలిసిందని ముకుల్ చెప్తాడు. మరి ఎవరని అందరు ఆలోచిస్తుంటారు. మరొకవైపు వీడియో భళే డిలీట్ చేసావంటూ భద్రని శైలేంద్ర మెచ్చుకుంటాడు. కానీ ఇప్పుడు అసలు రిషిని కిడ్నాప్ చేసింది ఎవరని వాళ్ళు కూడా అనుకుంటారు. ఒకవేళ ఆ రాజీవ్ గాడు కిడ్నాప్ చేసి ఉంటాడా అని శైలెంద్ర మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |